Embibeలోని ‘లెర్న్’లో ప్రపంచంలోనే అత్యుత్తమమైన కంటెంట్ 3D రూపంలో ఉండడం వలన కేవలం చూడడం ద్వారానే ఎంతటి కష్టతరమైన అంశాలనైనా సులభంగా అర్థం చేసుకోవచ్చు.
- నమూనాలు మరియు యానిమేషన్స్తో కూడిన ఉపాధ్యాయుల వలె వివరించే వివరణాత్మక వీడియోలు
- 3D అనుకరణలు మరియు ప్రయోగాలు
- ఇంటరాక్టివ్ కూబుస్
- ‘గుర్తుంచుకోవాల్సిన పాయింట్లు’ టెక్ట్స్ రూపంలో ఉన్న సారాంశాలు
- డీఐవై (డూ ఇట్ యువర్సెల్ఫ్) వీడియోలు
- ‘ఎక్స్ప్లోర్ అవుట్ ఆఫ్ సిలబస్’ వీడియోలు
- స్పూఫ్స్
- ‘ఇన్ రియల్ లైఫ్’ వీడియోలు
- ప్రయోగాలు
- పరిష్కరించిన ఉదాహరణలు
- వెబ్ నుంచి సేకరించిన ఇతరత్రా ఆసక్తికరమైన వీడియోలు
వీటిని ప్రధాన పుస్తకాలతో విలీనం చేశారు. పరిశ్రమలోనే అత్యంత ఎక్కువగా 74,000+ అంశాల యొక్క నాలెడ్జ్ గ్రాఫ్ మరియు 2,03,000+ సామర్థ్యాల కలయికతో ఏర్పడే పునాదిపై మీకు నేర్చుకున్న అనుభవం కలుగుతుంది.
‘లెర్న్’ యొక్క ముఖ్యమైన లక్షణాలు ఈ కింది విధంగా ఉన్నాయి;
- వివిధ లక్ష్యాలు మరియు పరీక్షలకు సంబంధించిన సుమారు 1,400+ టాప్ ర్యాంక్ పుస్తకాలు
- 74,000+ అంశాలకు సంబంధించిన నాలెడ్జ్ గ్రాఫ్లతో కూడిన Embibe బోధనశాస్త్రం, దోషరహితమైన అభ్యాస కంటెంట్ సంయుక్తంగా వివిధ తరగతులు, పరీక్షలు మరియు లక్ష్యాలలో లోతైన వ్యక్తిగతీకరణను అందిస్తాయి.
- ‘లెర్న్’ కంటెంట్లో లోతుగా విశ్లేషించడం ద్వారా ఎక్కడ అయితే సూక్ష్మఅంతరాలు ఉన్నాయో గుర్తించి వాటిని సరిచేసుకోవడానికి అవకాశం కల్పిస్తాయి. వ్యక్తిగతంగా పున:శ్చరణ చేసుకోవడానికి, అలాగే నేర్చుకునే ప్రక్రియను మరింత వేగవంతం చేసే విధంగా అల్గారిథంని అందిస్తాయి.
- బాగా అధ్యయనం చేసిన అంశాల అనుక్రమం సిలబస్లో ఉన్న అన్ని అంతర ఆధారిత అంశాలకు సంబంధించి చక్కని స్పష్టతని ఇస్తుంది.
- ఒక వరుసక్రమంలో ఉన్న 3D వివరణలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పూర్తి సిలబస్ని లోతైన అవగాహన కలిగించడం ద్వారా కవర్ చేస్తాయి.
- చక్కగా గుర్తుతెచ్చుకోవడానికి మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి టూల్స్ ఉపకరిస్తాయి.
- ‘కంటిన్యూ లెర్నింగ్’ ఫీచర్ నేర్చుకునే కృత్యాలను ఒక విద్యార్థి ఎక్కడైతే ఆపారో తిరిగి అక్కడి నుంచే మొదలుపెట్టడానికి సహాయపడుతుంది. దీని ద్వారా వారు గతంలో నేర్చుకున్నది పున:శ్చరణ చేసుకుని తదుపరి భాగాన్ని పూర్తి వీడియో లేదా ప్రశ్నలను మొత్తం చూడాల్సిన అవసరం లేకుండా ఆపిన దగ్గర నుంచే కొనసాగించవచ్చు.
- పుస్తకాలలోని సారాంశం పేజీలో విద్యార్థులు రెండు రకాల కాలవ్యవధులను చూడచ్చు. ఇవి సబ్జెక్ట్ పేరుతో కలిపి మీకు కనిపిస్తాయి. వాటిలో మొదటి కాలవ్యవధి పుస్తకంలో గల అన్ని వీడియోలు చూసేందుకు పట్టే సమయం. రెండో కాలవ్యవధి పుస్తకంలోని అన్ని అభ్యాస ప్రశ్నలను పూర్తి చేయడానికి పట్టే సమయం.
- ‘గుర్తుంచుకోవాల్సిన పాయింట్లు’ అనేవి అధ్యాయానికి సంబంధించిన పూర్తి సారాన్ని మనకు అందిస్తాయి. అధ్యాయానికి సంబంధించి వివరణ మరియు అవగాహన ఇచ్చే అన్ని అంశాలు, నిర్వచనాలు మరియు సూత్రాలు ఉంటాయి. పరీక్షల దృక్కోణంలో ముఖ్యమైన, ప్రయోజనకరమైన అంశాలను బాగా గుర్తుపెట్టుకునేందుకు మరియు నెమరువేసుకునేందుకు ఉపయోగపడే ఒక చేతిపుస్తకం వంటిది ఇది.
ఒక అధ్యాయం, టాపిక్ లేదా అంశం ఎందులోనైనా సరే పట్టు లభించాలంటే అందుకు నేర్చుకునే విధానం మరియు అభ్యాసం రెండూ ముఖ్యమే. ఈ రెండింటినీ విభజించే నియమం ఏమీ ప్రత్యేకంగా లేదు. ఇంకా చెప్పాలంటే- ఇది అభ్యాసం యొక్క పరిమాణం కంటే నాణ్యతకు సంబంధించిన విషయం. మా ‘బుక్స్ విత్ వీడియోస్ అండ్ సొల్యుషన్స్’ ద్వారా విద్యార్థులు ఒక అధ్యాయం పూర్తి దృష్టిని టాపిక్ వారీగా అభ్యాసం మీద పెడుతూ నేర్చుకున్నట్లయితే వారికి ఆ అంశానికి సంబంధించి ప్రాథమిక విజ్ఞానం తప్పకుండా చాలా బలంగా ఉంటుంది. ప్రవర్తన మరియు అంశాల స్థాయిలో అటెంప్ట్ చేసే క్రమంలో విద్యార్థులు తమ బలహీనతలను అధిగమించేందుకు ఎంతగా శ్రమిస్తారో వారు అంత బలంగా మారతారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే అభ్యాసం మరియు తప్పులను విశ్లేషణ, అంశాల స్థాయిలో బలహీనతలు తెలుసుకోవడం ద్వారా విద్యార్థులు అంశాలవారీగా తమ విజ్ఞానాన్ని మరింత బలపరుచుకుంటూ ఉంటారు. వారి ప్రవర్తన మరియు అటెంప్ట్లోని నాణ్యతలను మెరుగుపరుచుకోవడం ద్వారా విద్యార్థులు సునాయాసంగా తరువాతి స్థాయికి చేరుకుంటారు.