నిర్మాణాత్మక ఆధారిత బోధన విధానం మరియు అభ్యాసంలో సామాజిక మరియు సాంస్కృతిక అంశాలను కల్పించాలి

సామజిక నిర్మాణాత్మకత సిద్దాంతం అనేది నేర్చుకునే స్వభావంపై ఆధారపడి ఉంటుంది.

అభ్యాసం అనేది సామాజిక సంబంధాన్ని కలిగి ఉంటుందని అనేక మంది పరిశోధకులు విశ్వసిస్తున్నారు. అంటే దీని అర్థం జ్ఞానాన్ని పొందటం. మానవ అభివృద్ది అనేది ఇతరులతో పరస్పర సంబంధంతో జరగుతుంది. సామాజిక నిర్మాణాత్మకత సిద్దాంతం అనేది నేర్చుకునే స్వభావంపై ఆధారపడి ఉంటుంది. 

నిర్మాణాత్మకత అనేది సాధరణంగా లెర్నింగ్ సిద్దాంతానికి ప్రాధాన్యత నిస్తుంది. విషయానికి సంబంధించిన  కఠినమైన అంశాలను  అభ్యాసకుడు అర్థం చేసుకుంటాడు. కేవలం విషయాన్ని స్వీకరించడం కాకుండా  అభ్యసకుడు ఓ అంశాన్ని ఇతరులతో చర్చించి దాని అర్థాన్ని తెలుసుకుంటాడు. భోధన అభ్యాసాల మార్పు ఉపాన్యాసాలు, మరియు ట్రాన్స్మీటల్ మోడ్స్ నుండి సమస్య-ఆధారిత సహకారం మరియు అనుభపూర్వక రూపకల్పనగా మారుతుంది. 

ఈ సిద్దాంతం ప్రకారం నేర్చుకోవడం అనేది కేవలం వ్యక్తి కొత్త విషయాన్ని పొందినప్పుడు మాత్రమే జరగదు. అభ్యాసంలో సామాజిక మరియు సంస్కృతిక అంశాలు ప్రధాన ప్రాత వహిస్తాయి. సఫలమైన బోధనా అభ్యాసము వ్యక్తుల మధ్య పరస్పర సంభాషణ మరియు చర్చపై ఆధారపడి ఉంటుంది. చర్చ విద్యార్థుల అవగాహన పై దృష్టి కేంద్రీకరిస్తుంది. ఈ సిద్దాంతం అధ్యాపకులకు తరగతి గదిలో ఉత్తేజిత మరియు సులభతర సంభాషణకు ప్రోత్సహిస్తుంది. 

తరగతి గదిలో పలు అధ్యయనాల ద్వారా  విద్యార్థుల చర్చ ఫలితంగా జ్ఞానార్జన మరియు నైపుణ్యతకు సామాజిక నిర్మాణాత్మక సిద్ధాంతం ప్రోత్సయిస్తుంది. ఉదాహరణ కు తరగతి గదిలో బృంద చర్చలో విద్యార్థి పాల్గొన్నప్పుడు విషయాన్నిబాగా అర్థం చేసుకొగలడు. మరియు  జ్ఞానాన్నిబదలాయింపు చేసుకొని, వారి సమాచార నైపుణ్యాలను అభివృద్ది చేసుకోగలడు. 

నిర్మాణాత్మక బోధన మరియు అభ్యాసం ఇలా రూపొందిస్తుంది:

  1. స్థిరమైన కార్యాచరణ
  2. అర్థం కోసం వెతకడం 
  3. పాఠ్యాంశాలను రూపొందించే పండితులు మరియు ఇతర జ్ఞాన సృష్టికర్తల భావనలను అర్థం చేసుకోవడం
  4. శిక్షణా ప్రక్రియ లో మూల్యాంకనం ఒక భాగము
  5. సంభాషణ ద్వారా సులభతరం అగు సహకార ప్రక్రియ 

నిర్మాణాత్మకత అధ్యాపకులకు మరియు విద్యార్థులు కలిసి అభ్యసించే సహకార విధానం

సామాజిక నిర్మాణాత్మక అభ్యస నమూనాలో  అధ్యాపకుడి యొక్క బాధ్యతలలో ఒకటి  ప్రతి ఒక్క విద్యార్థి యొక్క వ్యక్తిత్వం గుర్తించడం. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్‌లో విద్యార్థి ఛాలెంజ్ చేయగలడు కానీ ఫలితం ఆశించలేడు. ఒత్తిడి లేని శిక్షణ పొందుతాడు.

అధ్యాపకుడు విద్యార్థికి ఇదివరకే తెలిసిన అంశంతో ప్రారంభించాలి. మరియు మరింత జ్ఞానానికి సహాయపడే ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించాలి.

సామజిక నిర్మాణాత్మకతలో విద్యార్థులు కాన్సెప్ట్స్ కు సంబంధించిన  విషయాన్ని మొదట ఎవరైన చెప్పడం ద్వారా తర్వాత లోతైన పరిశీలన ద్వారా అవగాహన చేసుకున్న తరువాత వాక్యాన్ని నేర్చుకుంటారు. విద్యార్థులు లెర్నింగ్ మెటీరియల్ తో స్వయంగా  పూర్తిచేయడానికి సవాలుగా ఉంటుంది మరియు సాధ్యంకాదు.  లెర్నింగ్ మెటీరియల్ సహాయంతో  పూర్తిగా నేర్చుకో గలుగుతారు. అంతర్గత అంశాలయిన పూర్వ అనుభవంతో కొత్త విషయాలను అవగాహన చేసుకోవచ్చు. అందువల్ల జ్ఞానాన్ని కన్‌స్ట్రక్షన్ మరియు అన్ కన్‌స్ట్రక్షన్ యొక్క  స్థిరమైన ప్రక్రియ ద్వారా  పొందుతాము.  విద్యార్థి తరగతి గదిలో ఒక సమూహ అభ్యాసకుడిగా పరిగణించవచ్చు. సామజిక నిర్మాణాత్మకతలో బోధన అనేది జ్ఞానాన్ని అభివృద్ది చేస్తూ, నైపుణ్యం మరియు వాదన అభివృద్ది చేస్తుంది.

సామాజిక నిర్మాణాత్మకతతో Embibe “Live Doubt Resolution” ద్వారా విద్యార్థులకు 24X7 విద్యా సంబంధ విషయాలలో చాట్ సహాయంతో సందేహాలను నివృత్తి చేస్తుంది. Student App మాత్రమే కాకుండా Parent App మరియు Teacher App లో కూడా విద్య ఆవరణ వ్యవస్థలో ఈ మూడింటి మధ్య సంబంధం కలిగి ఉంటుంది.   JIO మీట్ ద్వారా మేము అధ్యపకులను మరియు తల్లితండ్రుల మధ్య సానుకూల పరిస్థితులను ఏర్పరుస్తాం. దీని ఫలితంగా విద్యార్థులలో విద్యా సంబంధ జ్ఞానంను మరియు నైపుణ్యాన్ని, సామాజిక సామర్థ్యాలు మెరుగుపడతాయి. తల్లితండ్రుల మరియు అధ్యపకుల సహకారంతో విద్యార్థులు తరగతులలో బాగా చదవగలరు, సమస్యలను పరిష్కరించగలరు. జీవితంలో రాణించగలరు.