• రాసిన వారు Revathi
  • చివరిగా మార్పుచేసినది 26-08-2022

ఆంధ్ర ప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ద్వితీయ సంవత్సరం పరీక్ష ప్రక్రియ 2023

img-icon

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షలు 12వ తరగతి విద్యార్థులకు తప్పనిసరి పరీక్షలు. పరీక్ష ప్రక్రియలో ప్రతి సబ్జెక్టుకు సబ్జెక్ట్ పేరు, ఎగ్జామ్ (పరీక్ష) కోడ్ మరియు ఎగ్జామ్ (పరీక్ష) కాల వ్యవధి ఉంటాయి. ఆర్ట్స్, కామర్స్, సైన్స్ స్ట్రీమ్స్ కోసం AP బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ http://bieap.gov.in/ లో 12వ తరగతి సిలబస్, సబ్జెక్టుల వారీగా పరీక్షా ప్రక్రియను విడుదల చేస్తుంది.

బీఐఈఏపీ ( BIEAP) పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఏపీ ఇంటర్ పరీక్షల ప్రక్రియ గురించి బాగా అర్ధం చేసుకోవాలి, దాని ద్వారా అడిగే ప్రశ్నలు, మార్కింగ్ స్కీమ్ గురించి తెలుసుకోవాలి. ఏపీ ఇంటర్ పరీక్షల సరళిని పరిశీలిస్తే, విద్యార్థులు పరీక్ష కోసం సిద్ధమవడానికి తమ కార్యాచరణను ప్లాన్ చేసుకోవచ్చు. 

12వ తరగతి ఆంధ్రప్రదేశ్ బోర్డ్ పరీక్షా ప్రక్రియను నాలుగు వర్గాలుగా విభజించవచ్చు:

1. గరిష్టం 100 మార్కులతో సబ్జెక్టులు: వీటిలో ఇంగ్లీషు, ఐచ్ఛిక భాషలు (తెలుగు, హిందీ, సంస్కృతం, ఫ్రెంచ్, ఉర్దూ, అరబిక్, తమిళం, కన్నడ, ఒరియా, మరాఠీ), వాణిజ్యం, ఆర్థిక శాస్త్రం, పౌరశాస్త్రం, చరిత్ర, భూగర్భ శాస్త్రం, హోమ్ సైన్స్, సోషియాలజీ, లాజిక్ , పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మరియు సైకాలజీ ఉన్నాయి.

2. గరిష్టం 75 మార్కులు ఉన్న సబ్జెక్టులు: వీటిలో మ్యాథ్స్ మరియు జియోగ్రఫీ ఉన్నాయి.

3. గరిష్టం 60 మార్కులు ఉన్న సబ్జెక్టులు: ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ మరియు బోటనీ వంటి సబ్జెక్టులు ఈ కేటగిరీ కిందకు వస్తాయి.

4. గరిష్టం 50 మార్కులు ఉన్న సబ్జెక్టులు: సంగీతం ఈ వర్గానికి సంబంధించిన సబ్జెక్టులలో ఒకటి

ప్రతి స్ట్రీమ్‌కు సంబంధించిన సబ్జెక్ట్‌లు, అలాగే భాష మరియు ఐచ్ఛిక పేపర్‌ని తెలుసుకోవడానికి దిగువ పట్టికను చూడండి:

సైన్స్ స్ట్రీమ్కామర్స్ స్ట్రీమ్ఆర్ట్స్ స్ట్రీమ్ఐచ్ఛికం/ భాష విషయం
వృక్ష శాస్త్రంఅకౌంటెన్సీచరిత్రఇంగ్లీష్ (మొదటి భాష)
జంతు శాస్త్రంబిజినెస్ స్టడీస్/కామర్స్భూగోళ శాస్త్రం మరియు భూగర్భ శాస్త్రంతెలుగు (రెండవ భాష)
భౌతిక శాస్త్రంఆర్థిక శాస్త్రంపౌర శాస్త్రం/రాజకీయ శాస్త్రంహిందీ
రసాయన శాస్త్రంఆంగ్లంమనోవిజ్ఞాన శాస్త్రంగణితం
గణితం (A)ఐచ్ఛికం(2)సామాజిక శాస్త్రంఆర్థికశాస్త్రం
గణితం (B)ఆర్థిక శాస్త్రంసంస్కృతం

AP బోర్డు ఇంటర్ తరగతి 12 యొక్క పరీక్ష ప్రక్రియ వివరాలు – మొత్తం సమయం

ప్రతి సబ్జెక్టుకు గరిష్టంగా 100 మార్కులు ఉంటుంది. ఉత్తీర్ణతకు ప్రతి సబ్జెక్టులో విద్యార్థి కనీసం 35% పొందాలి. అదనంగా, పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి మొత్తం 35% స్కోర్ అవసరం. పరీక్ష మొత్తం వ్యవధి మూడు గంటలు. పరీక్షా విధానం మరియు మార్కింగ్ స్కీమ్ గురించి ముఖ్యాంశాలను తెలుసుకోవడానికి దిగువ పట్టికను చూడండి:

పారామితులువివరాలు
ప్రతి పేపర్‌కు గరిష్ట మార్కులు100 మార్కులు
మొత్తం సమయ వ్యవధి3 గంటలు
అర్హత మార్కులుప్రతి సబ్జెక్టులో 35 మార్కులు మరియు మొత్తం 35%
నెగెటివ్ మార్కింగ్లేదు

ఏపీ (AP) ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం మార్కింగ్ స్కీం 2023 – వివరాలు

బోర్డు పేరుబోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
తరగతిఇంటర్మీడియట్ 2వ సంవత్సరం
పరీక్ష పేరుపబ్లిక్ ఎగ్జామ్స్
విభాగంపరీక్ష ప్రక్రియ
ప్రదేశంఆంధ్ర ప్రదేశ్ 
అధికారిక వెబ్‌సైట్http://bieap.gov.in/

12వ తరగతి ఇంటర్ బోర్డు 2023 పరీక్షల పూర్తి పరీక్షా ప్రక్రియ గురించి విద్యార్థులు ఆలోచించడానికి ఆంధ్ర ప్రదేశ్ బోర్డ్ ఎగ్జామ్ ప్యాట్రన్ సహాయపడుతుంది. ఏపీ బోర్డు మార్కింగ్ స్కీమ్ ద్ద్వారా, విద్యార్థులు 2023 లో వారి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షలలో ఉత్తమమైన మార్కులను పొందడం కోసం తమను తాము సిద్ధం చేసుకోవచ్చు.

  ఇంటర్ సెకండ్ ఇయర్ AP బోర్డు ప్రిపరేషన్ వ్యూహం

విద్యార్ధి భవిష్యత్ జీవితంలో ఇంటర్మీడియట్ విద్య ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అన్ని సబ్జెక్టుల్లో ఎక్కువ మార్కులు రావడానికి ఎలా చదవాలి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఇలాంటి ప్రశ్నలకు EMBIBE ద్వారా మీకు సమాధానాలను ఇవ్వబోతున్నాను. వీటిని జాగ్రత్తగా పాటిస్తే పరీక్షల్లో ఎక్కువ మార్కులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. 

భౌతిక శాస్త్రం

విద్యార్థులు భౌతిక శాస్త్రాన్ని చదివిన తర్వాత దాన్ని పున:శ్చరణ చేసుకోడానికి కూడా సమయాన్ని కేటాయించాలి. మునుపటి సంవత్సరం క్వశ్చన్ పేపర్లను చదవడం ద్వారా ఎక్కువ మార్కులు తెచ్చుకొనే అవకాశం ఉంటుంది. 

దీర్ఘ సమాధాన ప్రశ్నలు సాధారణంగా తరంగాలు,  ప్రవాహ విద్యుత్,  కేంద్రాల నుండి వస్తాయి. కిరణ దృశ శాస్త్రం, తరంగ దృశ శాస్త్రం, విద్యుత్ ఆవేశాలు, క్షేత్రాలు, కెపాసిటర్లు, చలించే ఆవేశాలు, అయస్కాంతత్వం, పరమాణువులు, అర్ధవాహకాలు, ఎలెక్ట్రానిక్ నుండి స్వల్ప సమాధాన ప్రశ్నలు వస్తాయి. ఇవి తరువాత పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడతాయి. ప్రతి పాఠం వెనుకనున్న లఘు ప్రశ్నలను కూడా చదువుతూ ఉండాలి. 

రసాయన శాస్త్రం

ఒక పాఠాన్ని చదువుతున్నప్పుడు దానిలో ఉన్న రసాయన సమీకరణాలు, సూత్రాలను అలాగే పటాలను ఒక కాగితంపై రాసుకోవాలి. కొన్నిసార్లు రెండు రెండు మార్కుల ప్రశ్నలను జతచేసి నాలుగు మార్కుల ప్రశ్న అడుగుతారు. అలాంటప్పుడు వాటికి సంబంధించిన సమీకరణాలు, పటాలు, ఉదాహరణలను రాయాలి..

ఎనిమిది మార్కుల ప్రశ్నలు కర్బన రసాయన శాస్త్రం అకర్బన రసాయన శాస్త్రం భౌతిక రసాయన శాస్త్రం నుండి వస్తాయి. కర్బన రసాయన శాస్త్రంలోని ఎనిమిది మార్కుల ప్రశ్నలు 2+2+2+2, 2+2+4, 4+4 గా అడగవచ్చు. అకర్బన రసాయన శాస్త్రం నుండి రసాయన ధర్మాలు, పేరుతో ఉన్న చర్యలు తయారీ విధానాలు గురించి ఎక్కువగా చదవాలి. భౌతిక రసాయన శాస్త్రంలో ఉన్న విద్యుత్ రసాయన శాస్త్రం, రసాయన శాస్త్రాల పై కూడా మనం దృష్టి పెట్టాలి. వీటి నుండి రెండు 4 మార్కుల ప్రశ్నలను జోడించి ఎనిమిది మార్కుల ప్రశ్నలుగా వస్తుంది. సాధారణంగా పాలిమర్లు, ఘనస్థితి, ద్రావణాలు, ఉపరితల రసాయన శాస్త్రం, లోహ నిష్కర్షణలో సాధారణ సూత్రాలు నుండి 4 మార్కుల ప్రశ్నలు వస్తాయి. 

వృక్ష శాస్త్రం

బోటనీలో బొమ్మలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. వృక్ష శాస్త్రంలోని చాప్టర్ లను వెయిటేజీ అనుగుణంగా చదవాలి. వాటిలో మీకు డయాగ్రమ్స్ వేయడం వస్తే అన్ని వచ్చినట్టే. అందుకే వాటిని తరచూ ప్రాక్టీస్ చేస్తూ వాటికి లేబులింగ్ చేస్తూ ఉండాలి. అప్పుడు మీకు పరీక్షలలో మర్చిపోయే అవకాశం ఉండదు. 

ఫిజియాలజీ లో కిరణజన్య సంయోగ క్రియ శ్వాసక్రియ, బయోటెక్నాలజీ, హ్యూమన్ వెల్ఫేర్ వంటి వాటిని బాగా చదవాలి. జవాబులు రాసేటప్పుడు వాటికి సంబంధించిన ఫ్లో చార్ట్ వేయడం ద్వారా ఎక్కువ మార్కులు సంపాదించవచ్చు. చిన్న, అతి చిన్న ప్రశ్నలను కూడా బాగా చదవాలి. అవి మీ స్కోర్ ను మరింత పెంచుతాయి. 

జంతు శాస్త్రం

దీనిలో ముఖ్యంగా దీర్ఘ సమాదాన ప్రశ్నలకు ప్రాధాన్యం ఇవ్వాలి. దీనిలో బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్కులేషన్ నుంచి స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ మరియు ఫంక్షన్ ఆఫ్ హార్ట్, ఎక్స్క్రిటరీ ప్రొడక్ట్ అండ్ ఎలిమినేషన్ నుండి ఎక్స్క్రిటరీ సిస్టమ్, యూరిన్ ఫార్మేషన్ మెకానిజం, రిప్రొడక్టివ్ సిస్టమ్ నుంచి మెయిల్ ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, హ్యూమన్ డెవలప్మెంట్, జెనటిక్స్ నుంచి మల్టిపుల్ ఎలిల్స్, క్రిస్ క్రాస్ ఇన్హెరీటెన్స్, జెనిటిక్ డిజాస్టర్, లింగ నిర్ధారణ మొదలైన వాటి నుండి ప్రశ్నలు వస్తాయి..

ఇంగ్లీష్ 

తెలుగు మీడియం విద్యార్థులకు ఆంగ్లం అంటే భయం ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఇంగ్లిష్ మీద పట్టు ఉన్నట్టుగా అనుకుంటారు. అయితే రెండూ సరైనవి కాదు. పట్టుదల కలిగి ఏకాగ్రతతో చదివితే ఎక్కువ మార్పులను సొంతం చేసుకోవడం చాలా సులభం. అయితే దానికి ముందుగా ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. 

రెండవ ఏడాది విద్యార్థులు మొదటి సంవత్సరంలో రాసినటువంటి అనుభవం ఉపయోగించుకోవాలి. అయితే మీరు సమయాన్ని కూడా అంచనా వేయగలగాలి. చాలాసార్లు మనకు అన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలిసినా సమయాన్ని సరిగ్గా పాటించకపోవడం వల్ల అన్నింటికీ సమాధానాలు రాయలేము. మనం సమాధానాలు రాసేటప్పుడు డిస్క్రిప్షన్ ఆఫ్ ప్రాసెస్ కు టైటిల్ ఉండాలి, అలాగే సివి రెస్యూమేలను సరైన ఫార్మెట్లో రాయాలి. పాసేజ్ సరైన రీతిలో అర్థం చేసుకొని ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నించండి. ఎక్కువగా గత ఏడాది ప్రశ్నాపత్రాలను చదవడం ద్వారా అధిక మార్కులను సంపాదించుకోవచ్చు. 

సంస్కృతం

ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థులు ప్రతి పదార్థ తాత్పర్యాలు, వ్యాసరూప ప్రశ్నలు, వ్యాకరణం వంటి వాటిని ఎక్కువగా అభ్యాసం చేస్తూ ఉండాలి. అలా చేయడం ద్వారా పరీక్షలో త్వరగా మర్చిపోరు. ముఖ్యంగా చిన్న మరియు  అతి చిన్న ప్రశ్నలు, సందర్భాలు వంటి వాటిని నేర్చుకుంటూ ఉండాలి. అతి చిన్న ప్రశ్నలకు సమాధానాలను వాక్య రూపంలో రాయాల్సి ఉంటుంది. పరీక్షా పత్రంలో ఎటువంటి కొట్టివేతలు ఉండకూడదు. ప్రశ్న సంఖ్యలు లేదా రోమన్ నెంబర్లు క్రమంగా ఉండేలా చూసుకోవాలి. ఇటువంటి చిన్న చిన్న విషయాలను పాటించడం ద్వారా మనం పరీక్షల్లో ఎక్కువ మార్కులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది.

AP ఇంటర్మీడియట్ గ్రేడింగ్ సిస్టమ్

ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను ప్రకటించడానికి బిఐఈఎపి గ్రేడింగ్ వ్యవస్థను ఉపయోగిస్తుంది. దీనిలో A1 నుంచి D1 వరకు 7 విభిన్న గ్రేడ్ ఉంటాయి అలాగే విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా అవి కేటాయించబడతాయి. గ్రేడింగ్ సిస్టమ్ మరియు విభిన్న మార్కులకు ఇవ్వబడే గ్రేడ్ గురించి తెలుసుకోవడం కోసం దిగువ పట్టికను చూడండి.

మొత్తం మార్కులుగ్రేడ్
91-100A1
81-90A2
71-80B1
61-70B2
51-60C1
41-50C2
35-40D1

ఆంధ్ర ప్రదేశ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరంపై తరచూ అడిగే ప్రశ్నలు (FAQలు):

ప్రశ్న 1: AP ఇంటర్ 12వ తరగతి పాస్ అవ్వాలంటే ఎన్ని మార్కులు రావాలి?

జ: ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షలలో ఉత్తీర్ణత కోసం ప్రతి సబ్జెక్టులో విద్యార్థి కనీసం 35% పొందాలి. 

ప్రశ్న 2: పరీక్షలు జరిగే విధానంలో ఏమైనా మార్పు ఉంటుందా?

జ. ప్రస్తుతం ఎలాంటి మార్పులను ఆంధ్ర ప్రదేశ్ బోర్డు తమ అధికారిక వెబ్సైటులో పేర్కొనలేదు. కాబట్టి పరీక్ష విధానంలో ఎలాంటి మార్పు ఉండదు, ఎప్పటిలాగానే జరుగుతాయి. ఏమైన మార్పులు జరిగితే మేము మా వెబ్సైటులో పేర్కొంటాము. తరచూ సందర్శించండి.

ప్రశ్న 3: పరీక్షలలో గ్రేస్ మార్కులు ఎన్ని ఇస్తారు?

జ: సిలబస్‌లో లేని ప్రశ్నలు ఒకవేళ పరీక్షలో వస్తే గ్రేస్ మార్కులు ఇచ్చే అవకాశం ఉంటుంది.

ప్రశ్న 4: ఇంటర్ ద్వితీయ సంవత్సరం AP బోర్డు పరీక్షా సమయం ఎంత? ఏమైనా గ్రేస్ టైమ్ ఉంటుందా?

జ: పరీక్ష మొత్తం సమయం 3 గంటలు. ఆ సమయంలోనే విద్యార్ధులు అన్నీ ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. గ్రేస్ టైమ్ ఏమి ఉండదు.

ప్రశ్న 5: ఆంధ్ర బోర్డు ఇంటర్ తరగతి 12 సప్లిమెంటరీ పరీక్షల గురించి వివరాలు చెప్పగలరా?

జ: సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్టు 3, 2022 నుండి ప్రారంభమవుతాయి. వాటి గురించిన పూర్తి వివరాలు అధికారిక వెబ్సైటులో ఇవ్వబడ్డాయి. 

AP 12వ తరగతి పరీక్షా ప్రక్రియ 2023పై ఈ వివరణాత్మక కథనం మీకు సహాయపడిందని మేము ఆశిస్తున్నాము. మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, మీరు మా వెబ్‌సైట్‌ను సందర్శించి, మీ ప్రశ్నలను దిగువన రాయండి మరియు మేము వీలైనంత త్వరగా మిమ్మల్ని సంప్రదిస్తాము.

AP 12వ తరగతి 2023పైన అవసరమైన చిట్కాలు మరియు అప్‌డేట్‌ల కోసం Embibeను చూస్తూ ఉండండి.

Embibeలో 3D లెర్నింగ్, బుక్ ప్రాక్టీస్, టెస్టులు మరియు సందేహ నివృత్తి ద్వారా మీ ఉత్తమ పనితీరు కనబరచండి