
ఆంధ్ర ప్రదేశ్ ఇంటర్ టైమ్ టేబుల్: 2023
August 25, 2022ఆంధ్ర ప్రదేశ్ బోర్డ్ 12వ తరగతి అప్లికేషన్ (దరఖాస్తు) ఫారాలు సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో అందుబాటులో ఉంటాయి. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరు కావాలనుకునే ప్రతి విద్యార్థి అప్లికేషన్ విధానం చాలా ముఖ్యమైనదిగా భావించాలి. పరీక్షలకు విద్యార్థులు నమోదు చేసుకోవడానికి AP బోర్డ్ తరగతి 12 పరీక్షా ఫారంను విడుదల చేస్తుంది. మీరు అప్లికేషన్ ఫారంను సరైన క్రమంలో నింపాలి. 12వ తరగతికి సంబంధించిన అప్లికేషన్ ఫారంను చివరి తేదీకి ముందు సమర్పించకపోతే, మీరు పరీక్షలు రాయడానికి అనర్హులుగా ప్రకటించబడతారు.
ఇంటర్మీడియట్ 12వ తరగతి ఆంధ్రా బోర్డు అప్లికేషన్ (దరఖాస్తు) ఫారం 2023 కొన్ని ముఖ్యమైన అంశాలు కింద ఇవ్వబడ్డాయి.
నిర్వహణ సంస్థ | బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ |
---|---|
పరీక్ష పేరు | AP ఇంటర్మీడియట్ బోర్డు పరీక్ష 2023 |
విభాగం | ఆంధ్రప్రదేశ్ బోర్డు ఇంటర్మీడియట్/12వ తరగతి రిజిస్ట్రేషన్ ఫారం |
రిజిస్ట్రేషన్ ఫారం విడుదల తేదీ | సెప్టెంబర్, 2023 (అంచనా) |
పరీక్ష ప్రారంభ తేదీ | మార్చి, 2023 (అంచనా) |
అధికారిక వెబ్‌సైట్ | bie.ap.gov.in |
విద్యార్థులు AP ఇంటర్ బోర్డు పరీక్షల అప్లికేషన్ (దరఖాస్తు) ఫారాన్ని బోర్డు అధికారిక పేజీలో సమర్పించవచ్చు. ఏపీ ఇంటర్మీడియట్ అప్లికేషన్ (దరఖాస్తు) ఫారం 2023 కోసం దరఖాస్తు చేయడానికి మీరు ఈ కింది పేర్కొన దశలను అనుసరించండి:
మొదటి దశ: ఏపీ(AP) ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ తెరవండి.
రెండవ దశ: హోమ్ పేజీలో కనిపించే “అప్లికేషన్ ఫారాలు” ఐకాన్ మీద క్లిక్ చేయండి.
మూడవ దశ: “AP 12వ తరగతి /ఇంటర్మీడియట్ రిజిస్ట్రేషన్ ఫారం” లింక్ కొరకు చూడండి అలాగే దానిపై క్లిక్ చేయండి.
నాల్గవ దశ: “AP 12వ తరగతి రిజిస్ట్రేషన్ ఫారం” కొత్త విండోలో PDF ఫైల్ వలే ఓపెన్ అవుతుంది.
అయిదవ దశ: విద్యార్థులు రిజిస్ట్రేషన్ ఫారం యొక్క ప్రింటవుట్ తీసుకొని, పాఠశాల అధికారుల సూచనల ప్రకారం దానిని నింపాలి.
ఆరవ దశ: రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడం కొరకు పేమెంట్‌ను పూర్తి చేయండి.
ఏడవ దశ: విద్యార్థులు భవిష్యత్తు అవసరాల కోసం దీనిని సేవ్ చేయాలి మరియు రిజిస్ట్రేషన్ ఫారాన్ని ప్రింటవుట్ తీసుకోవాలి.
ఆంధ్ర ప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు రెండవ సంవత్సరం రిజిస్ట్రేషన్ ఫారం యొక్క నమూనా కింద ఇవ్వబడింది
విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను సమర్పించాలి. ఈ ఫారమ్‌కు వార్షిక పరీక్ష యొక్క అప్లికేషన్ ఫారమ్‌కు సమానమైన ప్రాముఖ్యత ఉంది. ఇది అధికారిక వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉంది, కాబట్టి మీరు సప్లిమెంటరీ పరీక్షకు ఎక్కడి నుండైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్ర ప్రదేశ్ బోర్డు 12వ తరగతి సప్లిమెంటరీ అప్లికేషన్ ఫారమ్ మెయిన్ పరీక్ష ఫలితాల ప్రకటన తర్వాత అందుబాటులో ఉంటుంది.
సప్లిమెంటరీ పరీక్ష ఫారమ్‌ను ప్రకటించిన తర్వాత, బోర్డు ఇమెయిల్ ID ద్వారా పాఠశాల అధికారులకు అప్లికేషన్ ఫారమ్‌ను పంపుతుంది. కాబట్టి, ముందుగా, మీరు సప్లిమెంటరీ పరీక్ష ఫారమ్ కోసం మీ పాఠశాల యాజమాన్యాన్ని అడగాలి. అలాగే, సప్లిమెంటరీ పరీక్షకు దరఖాస్తు చేయడానికి, మీరు ఫారమ్ ఫీజును సమర్పించాలి. ఈ ఫీజును బోర్డు నిర్ణయిస్తుంది.
విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షకు ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. బోర్డు విద్యార్థులకు ఈ సదుపాయాన్ని కల్పిస్తుంది, తద్వారా వారు ఎక్కడి నుండైనా అప్లికేషన్ ఫారమ్‌ను సులభంగా పూరించవచ్చు. దానికి మీరు క్రింది దశలను అనుసరించాలి:
1. విద్యార్థులందరూ ఎలాంటి తప్పులు లేకుండా అప్లికేషన్ ఫారంలోని అన్నింటినీ పూరించాల్సి ఉంటుంది, తద్వారా తరువాత ఎలాంటి సమస్య తలెత్తకుండా ఉంటుంది.
2. దరఖాస్తు ఫారాన్ని గడువు తేదీలోగా సమర్పించాలి, దాని వల్ల విద్యార్థులు ఆలస్యం చేయడం కారణంగా వర్తించే రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు
3. నమోదు చేసేటప్పుడు పేర్కొన్న అన్ని వివరాలు మరియు సమాచారం ఎస్ ఎస్ సి (SSC) లేదా మెట్రిక్యులేషన్ వంటి అర్హత పరీక్ష యొక్క విద్యార్థుల సర్టిఫికేట్‌లో ఇచ్చిన వివరాలకు సమానంగా ఉండాలి..
4. పూర్తి సమాచారం ఇవ్వని లేదా తప్పుగా పూరించిన అన్ని అప్లికేషన్ ఫారాలు తర్వాత ఎలాంటి మినహాయింపులు లేకుండా తిరస్కరించబడతాయి అని గమనించాలి.
5. రెగ్యులర్ విద్యార్థులు ఫీసును సంబంధిత పాఠశాల ప్రిన్సిపాల్‌కు పరీక్ష ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.
ఆంధ్ర ప్రదేశ్ 12వ తరగతి ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల టైమ్ టేబుల్ 2023 జనవరిలో ఇంటర్మీడియట్ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో విడుదల చేయబడుతుంది. టైమ్ టేబుల్ అధికారిక వెబ్‌సైట్‌లో త్వరలో అప్‌డేట్ చేయబడుతుంది. వార్షిక పరీక్షలలో పాల్గొనబోయే వ్యక్తులు ప్రధాన పోర్టల్ నుండి టైమ్ టేబుల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. AP ఇంటర్మీడియట్ బోర్డు రెగ్యులర్ వార్షిక పరీక్షలను మార్చి/ఏప్రిల్ నెలలో నిర్వహించబోతోంది. విద్యార్థులు ఆంధ్రా ఇంటర్మీడియట్ బోర్డ్ టైమ్ టేబుల్ 2023ని డౌన్‌లోడ్ చేసుకోగలరు.
ప్రశ్న 1: 12వ తరగతి అప్లికేషన్ (దరఖాస్తు) ప్రక్రియను ఏపీ(AP) బోర్డు ఎప్పుడు ప్రారంభిస్తుంది?
జవాబు. ఏపీ(AP) బోర్డు ఇంటర్ ద్వితీయ సంవత్సరానికి సంబంధించిన అప్లికేషన్ ఫారం 2023ను సాధారణంగా సెప్టెంబర్ లేదా అక్టోబర్ 2023 సంవత్సరంలో విడుదల చేయడం జరుగుతుంది.
ప్రశ్న 2: ఏపీ బోర్డ్ 12వ తరగతి అప్లికేషన్ (దరఖాస్తు) ఫారాన్ని నేను ఏవిధంగా డౌన్ లోడ్ చేసుకోగలను?
జవాబు. ఇంటర్ ఆంధ్రా బోర్డు ద్వితీయ సంవత్సరం అప్లికేషన్ (దరఖాస్తు) ఫారాన్ని అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఫారాలు స్కూలులో కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి విద్యార్థులు స్కూలుకు వెళ్ళి వాటిని సేకరించవచ్చు.
ప్రశ్న 3: AP బోర్డ్ ఇంటర్ రెండవ సంవత్సరం అప్లికేషన్ ఫారం ధర ఎంత?
జవాబు. AP బోర్డ్ ఇంటర్ రెండవ సంవత్సరం అప్లికేషన్ ఫారం యొక్క ధర రూ. 10.00 ఉంటుంది.
ప్రశ్న 4: నేను ఇంటర్ ఆంధ్రా బోర్డు ద్వితీయ సంవత్సరం రిజిస్ట్రేషన్ ఫారాన్ని ఆన్‌లైన్‌లోని వెబ్‌సైట్‌లో సబ్మిట్ చేయవచ్చా?
జవాబు. విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఫారాన్ని సమర్పించలేరు. అవసరమైన ఫీజుతో పాటుగా ఫారాన్ని సంబంధిత స్కూలులో సమర్పించాలి. తరువాత పాఠశాల వివరాలను బోర్డుకు పంపిస్తుంది.
ప్రశ్న 5: ఏపీ బోర్డు రెండవ సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షకు రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత?
జవాబు. ఏపీ బోర్డు రెండవ సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షకు రిజిస్ట్రేషన్ ఫీజు సుమారు 1000 రూపాయలు ఉంటుంది. స్కూలు సిఫారసు చేసీన పద్ధతుల ద్వారా ఫీజులు చెల్లించబడతాయి.
ప్రశ్న 6: ద్వితీయ సంవత్సరానికి సంబంధించిన అప్లికేషన్ ఫారమ్ సరిగ్గా నింపకపోతే ఏమవుతుంది?
జవాబు. విద్యార్థులు అప్లికేషన్ ఫారాన్ని సరిగ్గా నింపకపోతే, వారి అప్లికేషన్ ఆమోదించబడదు. దీంతో వారు పరీక్షలకు అనర్హులుగా ప్రకటించే అవకాశం కూడా ఉంది.
ప్రశ్న 7: అప్లికేషన్ ఫారంను విద్యార్థులు నింపాలా లేక కళాశాల యాజమన్యాలు నింపవచ్చా?
జవాబు. ఆన్‌లైన్ విధానంలో అయితే విద్యార్థులు నేరుగా అధికారిక వెబ్‌సైట్ ద్వారా నింపవచ్చు. అయితే విద్యార్థులు తప్పులు చేసే అవకాశం ఉంటుంది. కావున, అప్లికేషన్ ఫారంను సాధారణంగా సంబంధిత కళాశాల యాజమాన్యాలు పూరిస్తారు.
AP 12వ తరగతి అప్లికేషన్ ఫారమ్ 2023పై ఈ వివరణాత్మక కథనం మీకు సహాయపడిందని మేము ఆశిస్తున్నాము. మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, మీరు మా వెబ్‌సైట్‌ను సందర్శించి, మీ ప్రశ్నలను దిగువన రాయండి మరియు మేము వీలైనంత త్వరగా మిమ్మల్ని సంప్రదిస్తాము.
AP 12వ తరగతి 2023పైన అవసరమైన చిట్కాలు మరియు అప్‌డేట్‌ల కోసం Embibeను చూస్తూ ఉండండి.